31, జులై 2021, శనివారం

చిరుధాన్యాల సిరి కొర్ర బియ్యం చక్కెర పొంగలి

                       అందరికి నమస్కారం,              

ఈ రోజు షుగర్ వున్నవారు కూడా  తినటానికి వీలు ఐన రుచికరమైన  చక్కెరపొంగలి చేసుకోబోతున్నాము.      మనం ఈ చెక్కరపొంగళిని మాములుగా చేసుకునేటట్టు బియ్యం తో కాకుండా కొర్రబియ్యంను వాడుకుని చేసుకోబోతున్నాం.  అంతే కాకుండా మామూలు బెల్లం బదులుగా  కొబ్బరి బెల్లాన్ని వాడుకుంటున్నాము.   కొబ్బరి బెల్లములో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.  అందుకనే దానిని వాడుకుంటున్నాము.  షుగర్ వున్నవారు కూడా తినవచ్చు .  మరి చిరుధాన్యాల సిరి అయినా కొర్రబియ్యంతో చెక్కరపొంగళి చేసుకుందాం.  

18, జులై 2021, ఆదివారం

Diabetic Challenger (డయాబెటిక్ చాలెంజర్ )

Sugar Testing
Sugar testing
నమస్కారమ్,

నా పేరు శ్రీ వైష్ణవి.  నేను డిగ్రీ క్లినికల్ న్యూట్రీషన్ చదువుకుంటున్నాను.  నేను 2008 వ సంవత్సరం నుండి బ్లాగింగ్ చేస్తునేవున్నాను.   లహరి. కాం అనే బ్లాగ్ ద్వారా మీకు నేను సుపరిచితురాలినే.  

నాకు పది సంవత్సరాల వయస్సునుండి చైల్డ్ రేడియో జాకీగా పనిచేసాను.  నేను అవధానాలలో మా తాతగారి (చింతా రామకృష్ణారావు (ఆంద్రామృతం బ్లాగ్) ) ప్రోత్సాహంతో పృచ్చకురాలుగా పాల్గొన్నాను.  

అనేక వంటల పోటీలలో పాల్గొని విజేతగా నిలిచాను.  

నేను ఇప్పుడు డయాబెటిక్ చాలెంజర్ అనే యూట్యుబ్ చానల్ ని ప్రారంభించాను. ఈ చానెల్లో మధుమేహులకు వుపయోగపడే  విషయాలను చెప్పాలని ఈ చానెల్ ను ప్రారంభించాను.  అదే చానెల్ పేరుతో ఇప్పుడు డయాబెటిక్ చాలెంజర్ అనే బ్లాగ్ ను ప్రారంభించాను.  

ఈ చానల్ (బ్లాగ్ ) లో మధుమేహులకు వుపయోగపడే ఆహార నియమాలు , రక్తం లో చెక్కెరను ఎలా పరీక్షించుకోవాలి.  ఇన్సులిన్ ఇంజక్షన్ ఎలా చెసుకోవాలి టెక్నిక్స్,  వ్యాయామాలు,  ఆహార పదార్దాలు,  ఎలాంటి ఆహారపదార్దాలు తినవచ్చు, ఎలాంటి ఆహారపదార్ధాలు తినకూడదు.  మధుమేహం మీద వుండే అపోహలు,  షుగర్ ని ఎలా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు, షుగర్ ఫ్రీ వంటకాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో విషయాలు చర్చించుకోబోతున్నాం,  

ఇవన్నీ నేను శ్రద్ధగా చెయ్యాలి అంటే .మీ అందరి మద్దతు మరియు ప్రోత్సాహం అవసరం 👍👍👍👍👍👍.దానికిగాను మీరెం చెయ్యాలి అంటే డయాబెటిక్ చానల్లొ నేను పోస్ట్ చేసిన వీడియోలు చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోవాలి. అంతే కాదు ఛానెల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చెసుకుని మీ స్నేహితులతో కూడా పంచుకోండి, లైక్ చేయండి అంతె .